
సింగరేణి కాలరీస్ సంస్థ సీఎండీ శ్రీధర్‌కు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రముఖ పత్రిక ‘ఆసియా వన్’ ఏటా వివిదరంగాలలో విశేషకృషి చేసినవారికి ది లీడర్ అవార్డును ఇస్తుంటుంది. ఈసారి సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. వచ్చే నెల 7వ తేదీన బ్యాంకాక్‌లో నిర్వహించబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకొంటారు.
దీనిపై శ్రీధర్ స్పందిస్తూ, “ఇది సింగరేణి కార్మికులందరి సమిష్టి కృషికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను. సింగరేణి అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తూ సంస్థను అభివృద్ధిపధంలో నడిపిస్తూ సంస్థకు ఇటువంటి గొప్ప గుర్తింపును కల్పించారు. సింగరేణి సంస్థలో అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.