కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌పై గులాబీ జెండా

కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌పై కూడా టిఆర్ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది. కార్పోరేషన్‌ పరిధిలోగల 60 డివిజన్లలో టిఆర్ఎస్‌ 33, బిజెపి 13, మజ్లీస్ 7, ఇతరులు 7 స్థానాలను గెలుచుకొన్నారు. కనుక కరీంనగర్‌ మేయర్, డెప్యూటీ మేయర్ పదవులను టిఆర్ఎస్‌ సొంతం చేసుకోండీ. మేయర్‌గా వై.సునీల్ రావు, డెప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపారాణి ఎన్నికయ్యారు. టిఆర్ఎస్‌కు మజ్లీస్ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఏడుగురు ఇండిపెండెంట్లు మంగళవారం టిఆర్ఎస్‌లో చేరిపోయారు. దాంతో మునిసిపల్ కార్పోరేషన్‌లో టిఆర్ఎస్‌ సొంత బలం 40, మజ్లీస్ పార్టీతో కలిపితే 47 అయ్యింది. కనుక కరీంనగర్‌లో ఇక టిఆర్ఎస్‌కు ఎదురేలేదు.