కరీంనగర్‌లో నేడు పోలింగ్

కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వాటిలో రెండు డివిజన్లు ఏకగ్రీవం కావడంతో నేడు మిగిలిన 58 డివిజన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటికి టిఆర్ఎస్‌ తరపున 58మంది, కాంగ్రెస్‌-51, బిజెపి-53, టిడిపి-14 మంది పోటీ పడుతున్నారు. మరో 157 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఈ 58 స్థానాలకు పోటీ పడుతున్నారు. కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌ పరిధిలో ఉన్న 2, 72,692 మంది ఓటర్లు నేడు తమ ఓటుహక్కు వినియోగించుకొనున్నారు. కరీంనగర్‌ పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-బిజెపి మద్య ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వాటితో గట్టిగానే పోటీపడింది. కరీంనగర్‌తో సహా రాష్ట్రంలో అన్నీ మునిసిపల్ కార్పోరేషన్‌లు, మునిసిపాలిటీల ఫలితాలు రేపు (శనివారం) మధ్యాహ్నంలోగా వెలువడనున్నాయి.