సంబంధిత వార్తలు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఆశించి భంగపడిన తెరాస సీనియర్ నేత దర్గా దయాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తదితరులు ఆయన ఇంటికి వెళ్ళి నచ్చజెప్పడంతో మెత్తబడ్డ దయాకర్ రెడ్డి మళ్ళీ తెరాస గూటికి చేరుకొని గులాబీ కండువా కప్పుకొన్నారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు పార్టీల కండువాలు మార్చిన ఘనత దక్కించుకొన్నారు.