ఇరాన్‌-అమెరికా గొడవ...బేగంపేటలో ట్రాఫిక్ జామ్‌!

ఇరాన్‌-అమెరికా మద్య యుద్ధవాతావరణ ప్రభావం యావత్ ప్రపంచదేశాలపై పడుతోంది. ఇరాన్‌-అమెరికా మద్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలో అన్ని దేశాలలో అమెరికా దౌత్యకార్యాలయాల వద్ద భారీగా భద్రతాదళాలను మోహరించాయి. హైదరాబాద్‌ బేగంపేటలో గల అమెరికా కాన్సులేట్ కార్యాలయంవద్ద కూడా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈరోజు ఉదయం నుంచి బారీగా పోలీసులను మోహరించారు. వారు ఆ మార్గంలో వెళ్ళే ప్రతీ ఒక్కరినీ ఆపి ప్రశ్నించి, అనుమానం కలిగినవారి వాహనాలను తనికీలు చేసి పంపిస్తున్నారు. దాంతో ఈరోజు ఉదయం బేగంపేట ప్రాంతంలో బారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.  తుంటి మీద కొడితే మూతిపళ్ళు రాలడం అంటే ఇదేనేమో?