సంబంధిత వార్తలు

ముందుగా రిజర్వేషన్లు ప్రకటించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ప్రజాహితవాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్ల పరిశీలన: జనవరి 12
నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీలు: జనవరి 12,13
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 14వరకు
పోలింగ్: జనవరి 22
అవసరమైతే రీపోలింగ్: జనవరి 24
కౌంటింగ్, ఫలితాలు ప్రకటన: జనవరి 25.