తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా సోమేష్ కుమార్

తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ నియమితులయ్యారు. ఆయన నియామక ఉత్తర్వులకు సంబందించిన ఫైలుపై సిఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి సంతకం చేశారు. కనుక నేటి నుంచి సోమేష్ కుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. సోమేష్ కుమార్‌ ఈ పదవిలో 2023, డిసెంబర్ 31వరకు కొనసాగుతారు.       

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్‌ 1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏస్‌ అధికారి. ఆయన డిల్లీ యూనివర్సిటీలో ఎంఏ (సైకాలజీ) చేశారు. ఐఏస్‌ శిక్షణ పూర్తయిన తరువాత మొదటిసారిగా నిజామాబాద్‌ జిల్లా బోధన్ సబ్ కలెక్టరుగా చేశారు. అప్పటి నుంచి వివిద జిల్లాలలో వివిద హోదాలలో వివిద శాఖలలో సేవలందించారు. 1995 నుంచి 1996 వరకు హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ అధనపు కార్యదర్శిగా చేశారు. ఈ సీఎస్ పదవి చేపట్టక మునుపు సోమేష్ కుమార్‌  రాష్ట్ర రెవెన్యూ, కమర్షియల్ టాక్సస్, రెరా, సిసిఎల్ఏ శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు కూడా వాటిని ఆయనే చూసుకొంటారు.    

నిన్న పదవీ విరమణ చేసిన ఎస్‌క్‌ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు.