ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే

భారత్‌ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 

 మనోజ్ ముకుంద్ నరవనే స్వస్థలం మహారాష్ట్రలోని పూణే. అక్కడే గల నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో మిలటరీ శిక్షణ పొందారు. ఆ తరువాత చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీలో డిఫెన్స్ స్టడీస్‌లో పీజీ, ఇండోర్‌లో దేవీ అహల్యా యూనివర్సిటీలో డిఫెన్స్ అండ్ మేనేజెమెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1980లో ఆర్మీలోని సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ ఏడో బెటాలియన్‌లో జేరి వివిద విభాగాలలో, వివిద ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. నరవనే సేవలకు గుర్తింపుగా విశిష్ట్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్ పొందారు. ఆయనకు భార్య వీణ ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్నారు. వారికి ఇరువురు కుమారులున్నారు.