సంబంధిత వార్తలు

హాజీపూర్ వరుస హత్యాచారాల కేసును విచారిస్తున్న ఫాస్ట్-ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించే ముందు నిందితుడి వాదన వినాలని భావించడంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. తాను ఎటువంటి నేరం చేయలేదని శ్రీనివాస్ రెడ్డి వాదించాడు. హత్యాచారానికి గురైన మైనర్ బాలికలను తాను ఎన్నడూ చూడనే లేదని చెప్పాడు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్షులు చెప్పినవన్నీ అబద్దాలేనని వాదించాడు. తన తరపున సాక్ష్యం చెప్పేందుకు తల్లితండ్రులు, సోదరుడిని అనుమతించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశాడు. అతని వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తరువాత ఈకేసును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.