సంబంధిత వార్తలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 120 పురపాలకసంఘాలకు, 10 కార్పొరేషన్లకు జనవరి 22న బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ వివరాలు:
నోటిఫికేషన్: జనవరి 7
నామినేషన్ల స్వీకరణ: జనవరి 8 నుంచి 11 వరకు
నామినేషన్ల పరిశీలన: జనవరి 12
నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీలు: జనవరి 12,13
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 14వరకు
పోలింగ్: జనవరి 22
అవసరమైతే రీపోలింగ్: జనవరి 24
కౌంటింగ్, ఫలితాలు ప్రకటన: జనవరి 25.