
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సర్వే సంస్థలు జోస్యం చెప్పినట్లుగానే ఈసారి కాంగ్రెస్-జెఎంఎం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్-జెఎంఎం కూటమి ఆధిక్యతతో కొనసాగుతోంది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నందున ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 41 అవుతుంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్-జెఎంఎం కూటమి-40, బిజెపి-31, ఏజెఎస్యూ-3, జెవిఎం-4 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. మరో 3 స్థానాలలో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అయితే గత అనుభవాలను బట్టి చూసినట్లయితే, కాంగ్రెస్-జెఎంఎం కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాలేకపోయినట్లయితే, కర్ణాటకలోలాగే బిజెపి వాటి ఎమ్మెల్యేలను ఆకర్షించి జార్ఖండ్‌లో కూడా అధికారం చేజిక్కించుకొనే ప్రయత్నాలు చేయడం తధ్యం. కనుక కాంగ్రెస్-జెఎంఎం బొటాబోటి మెజారిటీతో గెలిచినా వాటి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోవచ్చు. ఎన్నికలలో గెలిచినప్పటికీ ప్రభుత్వాలు మనుగడ సాగించలేకపోవడం చాలా బాధాకరమే కానీ ఇది చేదు నిజం.