సంబంధిత వార్తలు
.jpg)
సిఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యదాద్రి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన తరువాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. కొండపై వివిఐపిల కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్స్, సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న కాటేజీలను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవగానే ఫిబ్రవరి నెలలో కొండపై మహా సుదర్శనయాగం చేయాలని నిర్ణయించినందున ఇవాళ పర్యటనలో యాగం నిర్వహించబోయే ప్రాంతాన్ని కూడా సందర్శించి అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకొంటారు.