దిశ కేసుపై హైకోర్టు తాజా ఆదేశాలు

దిశ కేసుపై హైకోర్టు స్పందించింది. ఈ నెల 9న నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపడతామని అంతవరకు వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారి మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలను తెలుసుకొనేందుకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. శనివారం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రి మార్చురీకి వెళ్ళి దిశ నిందితుల మృతదేహాలను పరిశీలిస్తారు. 

నిందితులు పోలీసులపై దాడి చేసి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం పోలీసులు  కాల్పులు జరిపారని సిపి సజ్జనార్ చెప్పారు. నిందితుల రాళ్ళు, కర్రలతో దాడులు చేసినప్పుడు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ గాయపడ్డారని, వారికి కేర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.