
జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో చాలా కాలంగా అన్నపూర్ణ భోజన పధకం విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పధకంలో కేవలం రూ.5కే భోజనం అందిస్తుండటంతో నగరంలో నిరుపేదలు, దినసరి కార్మికులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల సహాయకులు, పేద విద్యార్ధులు తదితరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ పధకం నిర్విఘ్నంగా సాగుతుండటంతో కొన్ని రోజుల క్రితం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం సమీపంలో కూడా ఏర్పాటు చేశారు. దానికీ మంచి ఆదరణ లభిస్తుండటంతో తరువాత నల్గొండ జిల్లా కోదాడ మున్సిపల్ కార్యాలయం సమీపంలో కూడా అన్నపూర్ణ భోజన పధకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి బుదవారం ప్రారంభించారు. హరేకృష్ణా సంస్థ సౌజన్యంతో ఈ పధకం అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.