మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఎత్తివేత

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి, శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలలో ఏదీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో గవర్నర్‌ సిఫార్సు మేరకు ఈనెల 12 నుంచి రాష్ట్రపతి పాలన విధించబడింది. అయితే నాటకీయ పరిణామాల మద్య ఈరోజు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజెపి శాసనసభ పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించిన కొద్దిసేపటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చోన్నా ఆకులో అన్నీ వచ్చి పడతాయంటే ఇదేనేమో? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక రాష్ట్రపతి పాలన విధించడం, తొలగించడం అన్నీ నిమిషాల మీద జరిగిపోయాయి.