2020 సం.లో శలవులు...వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో 2020 సం.లో శలవుల జాబితాకు సంబందించి ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం జారీ చేశారు. దాని ప్రకారం 2020 సం.లో మొత్తం 28 సాధారణ శలవులు, 20 ఐచ్చిక శలవులు ఉన్నాయి. విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రజాపనులశాఖలకు వేరేగా శలవుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఫితర్‌, ఈద్‌-ఉల్‌-జుహ, మొహర్రం, ఈద్‌-ఉల్‌-మిలాద్‌ పండుగలను చంద్రుడు కనిపించడం ఆధారంగా చేసుకొంటారు కనుక అవసరమైతే అప్పుడు శలవు తేదీలను మార్చుకోవచ్చునని ఉత్తర్వులలో పేర్కొన్నారు. శలవుల జాబితాను, ఐచ్చిక శలవులకు సంబందించి నిబందనలను రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాధిపతులకు, జిల్లా కలెక్టర్లకు పంపించారు.  

సాధారణ సెలవులు : 

జనవరిలో శలవులు: 

కొత్త సంవత్సరం: జనవరి 1 (బుధవారం)

భోగి: జనవరి 14 (మంగళవారం)

సంక్రాంతి: జనవరి 15 (బుధవారం)

గణతంత్ర దినోత్సవం: జనవరి 26 (ఆదివారం)

ఫిబ్రవరి: 

మహా శివరాత్రి: ఫిబ్రవరి 21 (శుక్రవారం)

మార్చి: 

హోలీ: మార్చి 9 (సోమవారం)

ఉగాది: మార్చి 25 (బుధవారం)

ఏప్రిల్: 

శ్రీరామనవమి: ఏప్రిల్‌ 2 (గురువారం)

గుడ్‌ ఫ్రైడే: ఏప్రిల్‌ 10 (శుక్రవారం)

జగ్జీవన్‌రాం జయంతి: ఏప్రిల్‌ 5 (ఆదివారం)

అంబేడ్కర్‌ జయంతి:  ఏప్రిల్‌ 14 (మంగళవారం)

మే నెల: 

రంజాన్‌: మే 25 (సోమవారం)

రంజాన్‌ మరుసటి రోజు: మే 26 (మంగళవారం)

జూలై: 

బోనాలు:  జూలై 20 (సోమవారం)

ఆగస్ట్: 

బక్రీద్‌: ఆగస్టు 1 (శనివారం)

శ్రీకృష్ణాష్టమి: ఆగస్టు 11 (మంగళవారం)

స్వాతంత్య్ర దినోత్సవం: ఆగస్టు 15 (శనివారం) 

వినాయక చవితి: ఆగస్టు 22 (శనివారం)

మొహర్రం: ఆగస్టు 30 (ఆదివారం)

అక్టోబర్: 

గాంధీ జయంతి: అక్టోబరు 2 (శుక్రవారం)

బతుకమ్మ పండుగ: అక్టోబరు 17 (శనివారం)

దుర్గాష్టమి: అక్టోబరు 24 (శనివారం)

విజయదశమి: అక్టోబరు 25 (ఆదివారం)

మిలాద్‌-ఉన్‌-నబి: అక్టోబరు 30 (శుక్రవారం)

నవంబర్: 

దీపావళి:  నవంబరు 14 (శనివారం)

కార్తిక పౌర్ణమి, గురునానక్‌ జయంతి:  నవంబరు 30 (సోమవారం)

డిసెంబర్: 

క్రిస్మస్‌:  డిసెంబరు 25 (శుక్రవారం)

బాక్సింగ్‌ డే:  డిసెంబరు 26 (శనివారం)

 ఐచ్ఛిక సెలవులు

జనవరి నెలలో శలవులు: 

సయ్యద్‌ మహమ్మద్‌ జువన్‌పురి జన్మదినం: జనవరి 10 (శుక్రవారం)

కనుమ: జనవరి 16 (గురువారం)

శ్రీపంచమి: జనవరి 30 (గురువారం)

మార్చి: 

సాహెబ్‌-ఎ-మిరాజ్‌: మార్చి 23 (సోమవారం)

ఏప్రిల్: 

మహవీర్‌ జయంతి: ఏప్రిల్‌ 6 (సోమవారం)

సాహెబ్‌-ఎ-బరాత్‌: ఏప్రిల్‌ 9 (గురువారం)

బసవ జయంతి: ఏప్రిల్‌ 26 (ఆదివారం)


మే నెల: 

బుద్ధ పూర్ణిమ: మే 7 (గురువారం)

షహాదత్‌ హజ్రత్‌ అలీ:  మే 14 (గురువారం)

షబ్బే ఖదీర్‌: మే 21 (గురువారం)

జుమా-అతుల్‌-వడా:  మే 22 (శుక్రవారం)

జూన్: 

రథయాత్ర: జూన్‌ 23 (మంగళవారం)

జూలై: 

వరలక్ష్మీ వ్రతం: జూలై 31 (శుక్రవారం)

ఆగస్ట్: 

రాఖీ పౌర్ణమి: ఆగస్టు 3 (సోమవారం)

ఈద్‌-ఎ-ఘదీర్‌: ఆగస్టు 9 (ఆదివారం)

పార్శీ కొత్త సంవత్సరం: ఆగస్టు 16 (ఆదివారం)

మొహర్రం:  ఆగస్టు 29 (శనివారం)

అక్టోబర్: 

ఆర్బయీన్‌: అక్టోబరు 8 (గురువారం)

నవంబర్: 

యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌: నవంబరు 27 (శుక్రవారం)

డిసెంబర్: 

క్రిస్మస్‌ ఈవ్‌:  డిసెంబరు 24 (గురువారం)