లోకో పైలట్ శేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం

సోమవారం ఉదయం కాచీగూడ స్టేషన్ సమీపంలో హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌-ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై కేర్ ఆసుపత్రి కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్  విడుదల చేసింది. ఈ ప్రమాదంలో అతని కిడ్నీ ఒకటి పూర్తిగా దెబ్బతిందని, రెండు కాళ్ళకు తీవ్ర గాయలవడం చేత కాళ్ళకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని, పక్కటెముకలు విరిగిపోయాయని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుష్మా ఉందని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాజిద్, మహమ్మద్ ఇబ్రహీం, బేలేశ్వరమ్మ, రాజ్‌కుమార్, శేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.