సంబంధిత వార్తలు

టీఎస్‌ఆర్టీసీని ప్రయివేటీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆర్టీసీలో కేంద్రప్రభుత్వం కూడా వాటాదారుగా ఉన్నందున, ఆర్టీసీపై ఆధారపడిన 48500 కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయరాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆర్టీసీ ప్రయివేటీకరణపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది