బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నడ్డా పర్యటన వాయిదా

బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా హైదరాబాద్‌, విజయవాడ పర్యటన వాయిదా పడ్డాయి. ఆయన శనివారం హైదరాబాద్‌ వచ్చి మర్నాడు విజయవాడ వెళ్లవలసి ఉంది. కానీ డిల్లీలో వేరేపనులుండటంతో పర్యటన వాయిదాపడినట్లు బిజెపి ప్రతినిధి తెలిపారు. ఆయన రేపు హైదరాబాద్‌ వస్తే ఆయన సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు బిజెపిలో చేరాలనుకొన్నారు. ఆయన పర్యటన వాయిదా పడింది కనుక మోత్కుపల్లి చేరిక కూడా వాయిదా పడింది. త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది కనుక జెపి నడ్డా అప్పుడు వచ్చే అవకాశం ఉంది.