సంబంధిత వార్తలు

ఇటీవల కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్రలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నప్పుడు, ఒక పోలీస్ అధికారి ఆయన మెడపై చెయ్యివేసి పక్కకు లాగిన ఘటనపై, ఆయన లోక్సభ స్పీకరు ఓం బిర్లాకు గురువారం ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై బండి సంజయ్ ప్రివిలైజ్ నోటీస్ స్పీకరుకు అందజేశారు. దానిని స్వీకరించిన స్పీకర్ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్కు దానిని అందజేసి, ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమే.