
కేంద్రప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను నియమించింది. 2003 నుంచి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న నామవరపు రాజేశ్వర్‌రావును అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామవరపు రాజేశ్వర్‌రావు మూడేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఆ నియామక ఉత్తర్వులలో పేర్కొంది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ కీలక దశకు చేరుకొన్న ఈ సమయంలో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల పరిణామమే అని భావించవచ్చు. కానీ ఈ కేసు విషయంలో ఆయన జోక్యం లేదా ప్రమేయం ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ జోక్యం చేసుకొంటే ఆయన ఏమైనా సాధించగలరా లేదా?అనే ప్రశ్నలకు 7వ తేదీన తదుపరి విచారణ జరిగినప్పుడు సమాధానాలు లభించవచ్చు.