జగన్ ఏరికోరి నియమించుకొన్న ఎల్వీకి బదిలీ!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు, విధేయుడు అనే పేరుంది. అందుకే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయనను అదే పదవిలో కొనసాగించారు. 

ఈరోజు వరకు ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యం కనుసన్నలలోనే నడిచింది. కానీ హటాత్తుగా ఆయనపై ఏలినవారి దయ తప్పడంతో బదిలీ వేటు పడింది. గుంటూరు జిల్లా బాపట్లలో గల ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ సిఎంఓలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ మరియు జీఏడి పోలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ పేరిట బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

సీసీఎల్‌ఏ స్పెషల్ సెక్రెటరీగా పనిచేస్తున్న నీరవ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక చీఫ్ సెక్రెటరీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ ఆయాయి. 

ఒక జీవో విషయంలో ప్రవీణ్ ప్రకాష్, ఎల్వీ సుబ్రహ్మణ్యంల మద్య విభేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో సిఎం జగన్ ఆగ్రహించి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం.