దీక్ష విరమించిన కూనంనేని

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆర్టీసీ జేఏసీ, సిపిఐ నేతలు, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అభ్యర్ధన మేరకు శుక్రవారం దీక్షను విరమించారు. ఆయన గత ఆరు రోజులుగా హైదరాబాద్‌ నీమ్స్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కనుక అందరూ కలిసి అభ్యర్ధించి ఆయన చేత దీక్ష విరమింపజేశారు. అనంతరం అఖిలపక్ష నేతలు అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్ళి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా వారు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు.