నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలు, తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తున్నందున ఇకపై ప్రభుత్వం ఏవిధంగా ముందుకు సాగాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వోద్యోగులకు డీఏ మంజూరు, భాషా పండిట్‌లు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడం, మరికొన్ని ఇతర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటారు. 

ఆర్టీసీలో అద్దె బస్సులను 30 శాతానికి పెంచి, మరో 20 శాతం ప్రైవేటీకరించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినందున ఆ ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.