
ఈ ఏడాది మే నెలలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియగానే వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సిద్దమయ్యాయి కానీ ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవడంతో ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల హైకోర్టు ఆ పిటిషన్లన్నిటినీ కొట్టివేయడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. కనుక రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. మొదటి విడతలో ఎటువంటి సమస్యలు, అభ్యంతరాలు లేని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి, మిగిలిన వాటికి మళ్ళీ కోర్టు అనుమతి తీసుకొని నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఏవిధంగా స్పందించబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది.