ప్రధాని నరేంద్రమోడీ సోమవారం సౌదీఅరేబియా పర్యటనకు బయలుదేరుతున్నారు. అయితే పాక్ గగనతలం మీదుగా సౌదీ చేరుకొనేందుకు తక్కువ సమయం పడుతుంది. కనుక భారత్ ప్రధాని నరేంద్రమోడీ విమానాన్ని పాక్ మీదుగా ప్రయాణించేందుకు అనుమతించాలని భారత్ అధికారులు పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ జమ్ముకశ్మీర్‌లో భారత్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందుకు నిరసనగా మోడీ విమానాన్ని తమ గగనతలంలోకి అనుమతించబోమని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ షా ఖురేషీ తెలిపారు.
క్రిందటి నెల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యూరోపియన్ దేశాల పర్యటనకు బయలుదేరినప్పుడు. ప్రధాని నరేంద్రమోడీ ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళుతున్నప్పుడు కూడా పాక్ ప్రభుత్వం వారి విమానాలను తమ గగనతలం మీదుగా అనుమతించలేదు. పాక్ తీర్పు భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పౌర విమాన సంస్థ (గ్లోబల్ సివిల్ ఏవియేషన్ బాడీ)కి భారత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొంది.