హుజూర్‌నగర్‌లో దూసుకుపోతున్న గులాబీ కారు

హుజూర్‌నగర్‌లో గులాబీ కారు తొలి రౌండ్ నుంచే శరవేగంతో దూసుకుపోతోంది. మధ్యాహ్నం 1.20 గంటల వరకు జరిగిన కౌంటింగులో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డికి 84003 ఓట్లు పోలవగా, కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతి రెడ్డికి 52021 ఓట్లు, బిజెపికి కేవలం 1206, టిడిపికి అంతకంటే తక్కువగా 1,142 ఓట్లు పడ్డాయి. ఈ ఉపఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీపడగా ఇతరులందరికీ కలిపి కేవలం 1,468 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే ఈ ఉపఎన్నికలలో తెరాస, కాంగ్రెస్‌లకు మాత్రమే ఓటర్లు ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది. తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి పద్మావతిరెడ్డిపై 31,982 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు కనుక ఆయన భారీ మెజార్టీతో గెలువబోతున్నారని స్పష్టం అయ్యింది.