హుజూర్‌నగర్‌ పోలింగ్ తాజా అప్‌డేట్స్

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, పోలింగ్ బూత్‌లలో  తగినంత వెలుతురు లేకపోవడం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా ఎటువంటి అవాంఛనీయఘటనలు జరుగలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటలకు 31.34 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 52.89 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదేవిధంగా పోలింగ్ కొనసాగినట్లయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 78-82 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈనెల 24న ఫలితాలు వెలువడతాయి.