కేటీఆర్‌తో అజారుద్దీన్ భేటీ

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడుగా ఎన్నికైన మహమ్మద్ అజారుద్దీన్ శనివారం ఉదయం మంత్రి కేటీఆర్‌తో బుద్ధ భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ప్యానల్ సభ్యులు కూడా కేటీఆర్‌ను కలిశారు. అధ్యక్షుడుగా ఎన్నికైనందుకు కేటీఆర్‌ అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం క్రికెట్‌తో సహా అన్ని క్రీడల అభివృద్ధికి పూర్తి సహకరిస్తుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాము తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని చెప్పారు. 

అయితే అజారుద్దీన్ తెరాసలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీలో సముచితస్థానమే కల్పించినప్పటికీ, ఆయన వలన కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ప్రయోజనం కలుగలేదనే చెప్పవచ్చు. కనుక ఒకవేళ ఆయన తెరాసలోకి వెళ్ళిపోయినా కాంగ్రెస్‌కు నష్టమేమీ ఉండకపోవచ్చు.