రేపటితో సచివాలయం శాస్వితంగా మూసివేత

తెలంగాణ సచివాలయం ఆదివారం సాయంత్రం శాస్వితంగా మూతపడబోతోంది. దాని స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో దానిలోని వివిద ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ బీఆర్‌కె భవన్‌, అరణ్య భవన్, మరికొన్ని ఇతర భవనాలలోకి తరలించిన సంగతి తెలిసిందే. సాధారణ పరిపాలనశాఖ అధికారులు నిన్నటి నుంచే సచివాలయంలో అన్ని బ్లాకులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తిగా ఖాళీ అయిన వాటికి తాళాలు వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి మొత్తం అన్ని బ్లాకులు పూర్తిగా ఖాళీ అవుతాయి. కనుక దశాబ్ధాలుగా సేవలందించిన సచివాలయం రేపటితో శాస్వితంగా మూతపడబోతోంది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కొన్ని రోజుల క్రితం విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఆదేశాలు వెలువడేవరకు సచివాలయం కూల్చరాదని ఆదేశించినందున, హైకోర్టు అనుమతి తీసుకొని కూల్చివేత పనులు మొదలుపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.