ఏడాదికి మూడు నాలుగు మిగ్ యుద్ధవిమానాలు కూలిపోవడం పరిపాటిగా మారిపోయింది. 2016 నుంచి నేటి వరకు 27 యుద్ధ విమానాలు కూలిపోయాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా బుదవారం ఉదయం 11 గంటలకు గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన మిగ్-21 యుద్ధవిమానం ఒకటి కూలిపోయింది. అదృష్టవశాత్తు పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. తరువాత కధ అందరికీ తెలిసిందే. ఇన్ని మిగ్ విమానాలు వరుసగా కూలిపోతుంటే వాటితో పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని వాయుసేన అధికారులు చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా పాక్‌తో యుద్ధం వస్తే ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఈ విమానాలతో ఏవిధంగా దాడి చేస్తారో?