రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక

ఆదివారం శాసనసభ సమావేశాల ముగింపురోజున సిఎం కేసీఆర్‌ సభలో మాట్లాడుతూ, “త్వరలోనే పారదర్శకమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తాము. పూర్తి పారదర్శకంగా, అవినీతిరహితంగా రాష్ట్రప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నాము. ఇది యావత్ దేశానికే ఆదర్శంగా ఉండబోతోందని నేను గట్టిగా చెప్పగలను. ఇది అమలులోకి వచ్చిన తరువాత దేశంలో అన్ని రాష్ట్రాలు దానిని కాపీ కొట్టడం ఖాయం. ప్రజాహితం కోసం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు ఆందోళనలు చేపట్టబోతున్నట్లు విన్నాను. దాని వలన వారే నష్టపోతున్నారని హెచ్చరిస్తున్నాను. శాసనసభ చట్టాలు చేస్తే దానిని ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. కాదని ఎదురుతిరిగినా, ప్రభుత్వానికి సవాళ్ళు విసిరినా వారిపై కటిన చర్యలు తప్పవు. కుక్క తోకను ఊపుతుంది కానీ తోక కుక్కను ఊపదని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. గతంలో పట్వేల్ వ్యవస్థ ఉండేది. దానీలో లోపాలున్నందున దానిని రద్దు చేశాము. ఇప్పుడు అవసరమైతే విఆర్వోలను తొలగిస్తాము. ఇది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలను అందరూ కట్టుబడి ఉండాల్సిందే తప్ప ప్రశించడానికి వీలులేదు. రాష్ట్ర హితం, ప్రజాహితం కోసం అవసరమైతే కటినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోను,” అని ఉద్యోగులను హెచ్చరించారు.