
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. వాటితోపాటే హుజూర్‌నగర్‌తో సహా దేశంలోని వివిద రాష్ట్రాలలోని 64 నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:
నేటి నుంచే ఆ రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 27
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 4
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 5
ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 7
పోలింగ్: అక్టోబర్ 21
కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: అక్టోబర్ 24.
హుజూర్‌నగర్‌తో సహా 64 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్: సెప్టెంబర్ 23
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 30
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 1
ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 3
పోలింగ్: అక్టోబర్ 21
కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: అక్టోబర్ 24.