సంబంధిత వార్తలు

హైదరాబాద్, జీడిమెట్ల పారిశ్రామికవాడలో గల కామాక్షి కార్తికేయ కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరుగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. ఫ్యాక్టరీ అంతటా మంటలు వ్యాపించడంతో లోపల నిలువ ఉంచిన భారీగా కెమికల్ డ్రమ్ములు కూడా తగులబడుతున్నాయి. దాంతో పరిసర ప్రాంతాలలో భరించలేనంత దుర్వాసన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.