కేసీఆర్‌ను కొందరు తప్పు దోవ పట్టిస్తున్నారు: తెరాస ఎమ్మెల్యే

“నేను సిఎం కేసీఆర్‌ దయవల్లే ఎమ్మెల్యే కాగలిగాను. కానీ ప్రస్తుత పరిస్థితులలో నేను తెరాసలో ఇమడలేను. కనుక రాజీనామా చేయాలనుకొంటున్నాను. సిఎం కేసీఆర్‌ను పార్టీలో కొందరు నేతలు తప్పు దోవపట్టిస్తున్నారు. సోమవారం పార్టీ మారడంపై నా నిర్ణయం ప్రకటిస్తాను,” అని అన్నారు బోధన్ తెరాస ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. 

మంత్రిపదవి లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన ఈరోజు మధ్యాహ్నం నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో భేటీ అయ్యి బిజెపిలో చేరే విషయమై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడినప్పుడు ఈ మాటలన్నారు. కనుక ఆయన పార్టీ మారడం ఖాయమేనాని భావించవచ్చు. ఆయనతో పాటు ఇంకా ఎంతమంది బిజెపిలోకి వచ్చేందుకు అవకాశం ఉందనే విషయంపై వారివురూ చర్చించినట్లు సమాచారం.