తెరాసలో ఫస్ట్ వికెట్?

ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరాలనుకునేవారే కానీ తెరాసలో నుంచి ఇతర పార్టీలలోకి వెళ్ళినవారు చాలా తక్కువే. ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, కొన్ని రోజుల క్రితం జి వివేక్ తెరాసను వీడారు.

మంత్రివర్గ విస్తరణలో పదవులు లభించక అసంతృప్తి చెందినవారిలో కొందరినైనా బిజెపిలోకి ఆకర్షించాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రిపదవి ఆశించి భంగపడిన బోధన్ తెరాస ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గురువారం మధ్యాహ్నం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అనంతరం పార్టీ మార్పు గురించి విలేఖరులు ప్రశ్నించగా ‘పార్టీ మారే అవకాశం ఉందన్నట్లు’ షకీల్ అహ్మద్ చెప్పడంతో త్వరలోనే తెరాసలో మొదటి వికెట్ పడబోతోందని అర్ధమవుతోంది.