మన దత్తన్న హిమాచల్‌కు పయనం

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఉదయం తన ఆర్ధాంగితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం 10.30 గంటలకు సీమ్లాలో రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన దత్తన్న ఇప్పుడు మరో మెట్టుపైకి ఎక్కి గవర్నర్‌ పదవి చేపట్టబోతున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే గుణం, అధిష్టానం పట్ల విధేయత కారణంగానే ఆయన నేడు ఈ స్థాయికి ఎదగగలిగారని చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోగల నైజం ఉన్నందున అజాతశత్రువుగా పేరొందారు. ఇవాళ్ళ హిమాచల్ ప్రదేశ్‌ బయలుదేరాబోయేముందు మీడియాతో మాట్లాడుతూ, “హిమాచల్ ప్రదేశ్‌ అభివృద్ధికి యధాశక్తిన సహకారిస్తానని దత్తన్న చెప్పారు.