సెప్టెంబర్ 22వరకు బడ్జెట్‌ సమావేశాలు

సోమవారం ఉదయం పూర్తిస్థాయి తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఉభయసభలు వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు. శలవురోజులు మినహా ఈనెల 22వరకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15,16 తేదీలలో బడ్జెట్‌పై సాధారణ చర్చ, 16న సభ్యుల ప్రశ్నలకు సిఎం కేసీఆర్‌ సమాధానాలు, 17న వివిద పద్దులపై చర్చ జరపాలని బీఏసి సమావేశంలో నిర్ణయించారు.