1.jpg)
ఎట్టకేలకు 9 నెలల తరువాత శుక్రవారం సాయంత్రం సిఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ఊహించినట్లుగానే హరీష్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి పదవులు లభించాయి. ఈసారి మంత్రివర్గంలో అవకాశం లభించదనుకున్న హరీష్ రావు అందరికంటే ముందుగా ప్రమాణస్వీకారం చేయగా ఆయన తరువాత కేటీఆర్ చేయడం విశేషం. అలాగే హరీష్ రావుకు గతంలో ఎంతో సమర్ధంగా నిర్వహించిన సాగునీటిశాఖకు బదులు అంతకంటే కీలకమైన, క్లిష్టమైన ఆర్ధికశాఖను కేటాయించడం విశేషం. కేటీఆర్‌కు మాత్రం మళ్ళీ గతంలో ఆయన నిర్వహించిన ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలనే కేటాయించారు.
మంత్రులు వారి శాఖలు:
హరీష్ రావు: ఆర్ధిక శాఖ
కేటీఆర్: ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు
పువ్వాడ అజయ్‌కుమార్: రవాణాశాఖ
గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
సత్యవతి రాథోడ్: గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్: పశుసంవర్ధక శాఖ, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు
ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్యశాఖ శాఖ
ప్రశాంత్ రెడ్డి: రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖలు
నిరంజన్ రెడ్డి: వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు
ఇంద్రకరణ్ రెడ్డి: దేవాదాయ, న్యాయ, పర్యావరణ, అటవీ శాఖలు
ఎర్రబెల్లి దయాకర్ రావు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు
శ్రీనివాస్ గౌడ్: ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు, పురావస్తు శాఖలు
కొప్పుల ఈశ్వర్: సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమం శాఖలు
మహమ్ముద్ ఆలీ: హోంశాఖ
జగదీష్ రెడ్డి: విద్యుత్ శాఖ
మల్లారెడ్డి: కార్మికశాఖ