1.jpg)
తెరాసకు అత్యంత ఇష్టమైన పనులు రెండు. 1. కొత్త భవనాలు నిర్మించడం, 2. ఎన్నికలు. మొదటిపని నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి కనుక వాటికోసం గత రెండు మూడు నెలలుగా సన్నాహాలు చేసుకొంటోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెరాస నేతలతో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తెరాస గెలుపు ఖాయం. ఒకవేళ హైకోర్టు అనుమతీస్తే ఈనెలాఖరులోగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కూడా సిద్దంగా ఉంది. ఒకటి రెండు రోజులలోనే మున్సిపల్ ఎన్నికలకు సమన్వయ కమిటీలను సిఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. వారందరికీ వెంటనే పార్టీ తరపున శిక్షణా తరగతులు నిర్వహిస్తాము,” అని అన్నారు.
కాంగ్రెస్, బిజెపిలు లోక్సభ ఎన్నికలలో 7 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఆ రెండు పార్టీలలో మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి కనబడటం లేదు. కనుక ఈసారి తెరాస అవలీలగా ఘనవిజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి.