
దేశ ఆర్ధిక రాజధాని ముంబై సమీపంలో గల నావీ ముంబైలోని ఉరాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంటులో మంగళవారం ఉదయం భారీ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుమంది సిబ్బంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం సంభవించగా అప్పటి నుంచి 50 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయంటే ప్రమాదతీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. తక్షణమే రంగంలో దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఓఎన్జీసీ ప్లాంటు స్మార్ట్ వాటర్ డ్రైనేజీ పైప్ నుంచి మంటలు మొదలైనట్లు అధికారులు చెపుతున్నారు. అయితే మంటలు పక్కనే ఉన్న ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంటుకు మంటలు వ్యాపించకుండా అరికట్టడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.