
సుమారు పదేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు డాక్టర్.తమిళసై సౌందర రాజన్‌ను గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.
మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ సీనియర్ బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రనికి గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కల్రాజ్ మిశ్రాము రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. మాజీ కాంగ్రెస్ నేత అరీఫ్ మహమ్మద్ ఖాన్ కేరళకు, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ కొషియారి మహారాష్ట్రకు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
బండారు దత్తాత్రేయ, డాక్టర్.తమిళసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసినందుకు తమకు తగిన గుర్తింపు లభించిందని అన్నారు. తమ సేవలను గుర్తించి గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించినందుకు వారిరువురూ ప్రధాని నరేంద్రమోడీకి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
గవర్నర్ నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్ నియమితులైనట్లు తెలియగానే సిఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్ళి మర్యాదపూర్వకంగా నరసింహన్‌ను కలిశారు. నరసింహన్‌కు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా నియమింపబాడుతారని ఊహాగానాలు వినిపించాయి కానీ కేంద్రప్రభుత్వం ఆయనకు ఏ పదవీ ఈయలేదు.