2.jpg)
మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరికి నాన్
బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆమె 2014 ఎన్నికలలో కళావతి బాయి అనే మహిళ
వద్ద నుంచి కోటి ముప్పై లక్షలు తీసుకొని ఆమె భర్తకు వైరా అసెంబ్లీ నియోజకవర్గం టికెట్
ఇప్పిస్తానని హామీ ఇచ్చారని కానీ టికెట్ ఇప్పించకపోగా తన డబ్బు వాపసు చేయడం లేదని ఆమె
ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రేణుకా చౌదరిపై సెక్షన్
420, 417కింద కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారణకు చేపట్టిన
ఖమ్మం రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రేణుకా చౌదరికి నోటీసులు పంపించినప్పటికీ
ఆమె స్పందించకపోవడంతో న్యాయమూర్తి శుక్రవారం ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
జారీ చేశారు.
మాజీ ఎంపీగా చేసిన రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
జారీ అవడం పార్టీకి ఒక అప్రదిష్టకాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకొంటారనే
ఆరోపణలను ఈ కేసు దృవీకరిస్తున్నట్లయింది. ఇది పార్టీకి మచ్చ తెచ్చేదే. ఈ కారణంగా ఆమెపై
క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లయితే అది కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త సమస్యకు దారితీయవచ్చు.