9.jpg)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు పధకం గురించి తెరాస నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా గొప్పగా చెప్పుకోవడం మరిచిపోరు. కానీ వర్షాకాలం ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రంలో 40 శాతం మందికి రైతుబంధు సొమ్ము ఇవ్వలేకపోయిందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం వారి ఖాతాలలో ఆ సొమ్మును జామా చేయాలని కోరారు. అలాగే తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పంట రుణాలమాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ హామీలు ఇచ్చారని కానీ ఇప్పుడు వాటి గురించి తెరాసలో ఎవరూ మాట్లాడటానికే ఇష్టపడటంలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటే కాదు దానిని ఆచరణలో చూపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.