తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సికింద్రాబాద్‌ నుంచి న్యూ డిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. రైలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్లప్‌ఘడ్ అనే ప్రాంతం చేరుకున్నప్పుడు 9వ నెంబర్ బోగీలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేసి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. రైల్వే, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు కానీ రెండు బోగీలు మంటలలో కాలి దగ్ధమైపోయాయి. ప్రయాణికులను వేరే రైల్లో డిల్లీకి పంపించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.