2.jpg)
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సభ్యత్వనమోదు కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేటితో సభ్యత్వనమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసుకున్నాము. కేవలం 45 రోజుల వ్యవదిలో 60 లక్షల మంది సభ్యులుగా చేరడం మన పార్టీకున్న అపూర్వమైన ప్రజాధారణకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా గజ్వేల్, వర్ధన్నపేటలో సభ్య్త్వాలు నమోదు అయ్యాయి. మిగిలిన ప్రాంతాలలో కూడా ఆశించినస్థాయి కంటే చాలా ఎక్కువగానే సభ్యులు చేరారు. మన పార్టీలో 60 లక్షల మంది సభ్యులు చేరగా, మనకి ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న బిజెపిలో కేవలం 12 లక్షల మంది మాత్రమే చేరారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రజలు ఎవరివైపు ఉన్నారో స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో తెరాసను మించిన పార్టీ లేదని మరోసారి నిరూపితమైంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన పార్టీలో ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.