
తెలంగాణ ప్రభుత్వంతో ప్రపంచ ప్రసిద్ది చెందిన గూగుల్ సంస్థ ఇటీవల ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిద శాఖలకు వెబ్‌సైట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేటికీ అవన్నీ ఇంగ్లీషులోనే ఉన్నందున సామాన్య ప్రజలకు వాటిలో పేర్కొన్న సమాచారాన్ని తెలుసుకోవడం కష్టమే. కనుక సరళమైన తెలుగుబాషలో ఆ సమాచారాన్ని అందించేందుకు గూగుల్ సహాయం తీసుకొంటోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కోసం గూగుల్ ప్రత్యేకంగా ‘నవ్‌లేఖ’ అనే సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది. దాని సహాయంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో తెలుగులో సమాచారం అందజేస్తుంది. వీలైతే తెలంగాణ మాండలీకంలోనే సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ను కోరినట్లు తెలుస్తోంది.