నన్నూ చంపేస్తారేమో? అసదుద్దీన్

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిజెపి, దాని హిందూ అనుబంద సంస్థలను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుదవారం దారుసల్లామ్‌లోని మజ్లీస్ పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు ఏదో ఓ రోజు గాడ్సే వారసులు నన్ను హతమార్చినా ఆశ్చర్యం లేదు. కానీ నేను ఎప్పటికీ మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్‌ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని బిజెపి నేతలు ప్రచారం చేసుకొంటున్నారు కదా మరి కశ్మీరీ ప్రజలు తమ సంతోషాన్ని బందుమిత్రులతో పంచుకోకుండా కశ్మీర్‌లో మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎందుకు నిలిపివేశారు?” అని ప్రశ్నించారు.