సంచలన వార్త: కశ్మీర్ నుంచి 70 మంది ఉగ్రవాదుల తరలింపు

 ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ తాజా సమాచారం ప్రకారం గురువారం సాయంత్రం కశ్మీర్ నుంచి 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటువాదులను భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌, లడ్డాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, స్వతంత్ర ప్రతిపత్తిని ఉపసంహరించిన తరువాత కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను, భారీస్థాయిలో ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. కనుక ఈ ప్రక్రియకు స్థానిక వేర్పాటువాదులు, ఉగ్రవాదులు వారి సానుభూతిపరుల వలన ఎటువంటి ఆటంకమూ కలుగకూడదనే ఉద్దేశ్యంతో వారిని అక్కడి నుంచి ఆగ్రాకు తరలించి ఉండవచ్చు. ఈ వార్తను కేంద్రహోంశాఖ ఇంకా దృవీకరించవలసి ఉంది.