
సిఎం కేసీఆర్ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు పెద్ద షాక్ ఇచ్చారు. సచివాలయంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను 72 గంటలలో బీఆర్కె భవన్, అరణ్యభవన్ ఇంకా వాటికి కేటాయించిన తాత్కాలిక కార్యాలయాలలోకి తరలించాలని ఆదేశించారు. నెలరోజుల క్రితం సిఎం కేసీఆర్ నూతన సచివాలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కానీ వివిద కారణాల వలన ఇంతవరకు సచివాలయం తరలింపు కార్యక్రమం పూర్తికాలేదు. మరొక రెండు మూడు వారాలలో పూర్తిచేయాలని అధికారులు భావిస్తుంటే, మూడు రోజులలోగా తరలింపు కార్యక్రమం ముగించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కె జోషి ఆదేశించడంతో అధికారులు హడావుడిగా ఆ పని మొదలుపెట్టారు.
ఎస్కె జోషి బుదవారం సచివాలయంలోని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి సచివాలయం తరలింపు గురించి వారితో చర్చించారు. సచివాలయంలోని వివిద కార్యాలయాలలోని ఫర్నీచర్, ఫైళ్ళు, కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మెషిన్లు వగైరాలన్నిటినీ తరలించడానికి కనీసం మరొక రెండు మూడు వారాలు సమయం అవసరమని అధికారులు చెప్పిన్నట్లు తెలుస్తోంది. కానీ ఎట్టి పరిస్థితులలో మూడు రోజులలోగా అన్ని కార్యాలయాలను తరలించాలని ఎస్కె జోషి ఆదేశించారు. తాత్కాలిక సచివాలయంగా గుర్తించిన బీఆర్క్ భవన్లో ముఖ్యకార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. సిఎం, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయాలను బేగంపేటలోని మెట్రో భవన్లో ఏర్పాటు చేయబోతున్నారు. అటవీశాఖ కార్యాలయాన్ని నాంపల్లిలోని అరణ్యభవన్కు తరలించబోతున్నారు.
సచివాలయం కూల్చేవేత, తరలింపులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఇంకా విచారణ పూర్తి చేయలేదు. కానీ విచారణ పూర్తయ్యేవరకు సచివాలయం కూల్చవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ శ్రావణమాసం మొదలైనందున వీలైనంత త్వరగా సచివాలయం కూల్చివేతపనులు మొదలుపెట్టి దసరా పండుగరోజు నుంచి కొత్త సచివాలయం నిర్మాణట్టాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.